శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం

81చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం నెలకొంది. సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ (26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం ఆదర్శ్ తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్