మినీ గోకులాల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోండి

51చూసినవారు
మినీ గోకులాల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోండి
ఉపాధి హామీ పథకం ద్వారా గోకులాల నిర్మాణాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మండల పశువైద్యాధికారి మల్లికార్జున బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మండలంలో పశువుల కాపరులకు మినీ గోకులాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆదేశానుసారం 2, 4, 6 ఆవులు గల రైతుకు గోకులం నిర్మాణానికి రూ. 1లక్ష 15వేలు, 1 లక్ష 85వేలు, 2 లక్షల 30వేలు చెల్లిస్తుందన్నారు. దీనికిగాను రైతులు తమ వంతు కింద డీడీల రూపంలో రూ. 11500, రూ. 18500, రూ. 23000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని పొందాలనుకున్న వారు తమ పరిధిలోని సచివాలయం ఏ హెచ్ ఓ సిబ్బందిని సంప్రదించి అప్లికేషన్ ఫామ్ ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్