కదిరిలోని ఒక విద్యా సంస్థ యాజమాన్యం టెక్నో, సిబ్యాచ్, ఐకాన్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. విద్యాసంస్థను సీజ్ చేయాలని, అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. రూ. 10 వేల నుంచి రూ. 22 వేల వరకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే ప్రీ ప్రైమరీకి ముందస్తు అడ్మిషన్లు చేశారని తెలిపారు.