కదిరిలో పాత నేరస్థులకు కౌన్సెలింగ్

75చూసినవారు
కదిరిలో పాత నేరస్థులకు కౌన్సెలింగ్
కదిరిలో పాత నేరస్థులకు సీఐ నారాయణ రెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు. గతంలో మట్కా, గంజాయి, పేకాట కేసులలో ఉన్న వారికి గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టణ పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో కొందరు మద్యం తాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా పోలీస్ మొబైల్ టీంలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్