మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ జగనన్న కాలనీలో 1170 ఇళ్ల పట్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అయితే అప్పటి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పలువురు తమ చేతుల్లోకి పట్టాలు తీసుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకున్నట్లు సమాచారం.