కదిరి పట్టణంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సంతాప సభ ను గురువారం కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం నాయకులు చిలమత్తూరు మోహన్ గాంధీ, ఇందాదుల్లా ఖాన్ ఖుదా బకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నగిరి శ్రీహరి ప్రసాద్ ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించినట్లు తెలిపారు.