కదిరి: ఆదాని గ్రూప్ కంపెనీల అవినీతిపై విచారణ జరపాలి: సిపిఐ

59చూసినవారు
ఆదాని గ్రూప్ కంపెనీల అవినీతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శ్రీసత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై, ఆదాని గ్రూపు కంపెనీల అవినీతిలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్