ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆదివారం కదిరి పట్టణంలోని జెడ్పీహైస్కూల్ నందు జరిగిన సత్యసాయి జిల్లా స్వర్ణోత్సవ మహాసభల నందు వరుసగా మూడవసారి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జయచంద్రారెడ్డి గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులుగా రెండుమార్లు, ఉమ్మడి అనంతపురం జిల్లా ఫ్యాప్టో చైర్మన్ గా కొనసాగారు.