కదిరి లక్ష్మీనరసింహస్వామి సంబంధించిన కదిరి కొండ ప్రాంతంలో గిరి ప్రదక్షిణ చేయడానికి స్వామి వారి భక్తులు పనులను ఏర్పాటు చేస్తున్నారు. స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సోమవారం ఉదయం నరసింహస్వామి ఆలయము నుండి కదిరి కొండ గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ దాదాపు 500 మంది పైన పాల్గొనే అవకాశం ఉందన్నారు. వారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నట్లు తెలిపారు.