కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా సోమవారం శ్రీఖాద్రీ గిరిప్రదక్షిణలో శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. దేవస్థానానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెంచు లక్ష్మి సమేత కొండల నరసింహ స్వామి వెలసిన కదిరి కొండ ప్రాంతంలో శ్రీవారి భక్తులు శ్రీఖాద్రీ గిరిప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.