అధైర్యపడకండి మీకు అండగా మేమున్నాం అని మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. ఆదివారం అక్రమంగా అరెస్టుకు గురైన కదిరి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యులు అమర్ నాధ్ రెడ్డి, వాల్మీకి అంజి కుటుంబ సభ్యులను కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్, నియోజకవర్గ నాయకులతో పాటు మాజీ మంత్రి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.