కదిరి: సీతారాముల వారి ఆలయ నిర్మాణానికి విరాళం

70చూసినవారు
కదిరి: సీతారాముల వారి ఆలయ నిర్మాణానికి విరాళం
శ్రీ సత్యసాయి జిల్లా, నల్లచెరువు మండల కేంద్రంలో శ్రీసీతారాముల వారి ఆలయానికి మండల నివాసి కీర్తిశేషులు రాజు నాయక్ కుటుంబ సభ్యులు సోమవారం రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్ భార్య భారతి, కుమారుడు మని కేశవ్ ఆలయ కమిటీ సభ్యులకు సంబంధిత నగదును చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రాజు నాయక్ కుటుంబానికి సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్