డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం శిక్షార్హం అని కదిరి ఎంవిఐ వరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం గాండ్ల పెంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంవిఐ వరప్రసాద్ మట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి అర్హులని తెలిపారు. ఆటో డ్రైవర్స్ తో ర్యాలీ నిర్వహించి రహదారి భద్రత పైన ప్రమాణం చేయించారు