కదిరి పట్టణంలోని 6వ వార్డు పాత అమీన్ నగర్, న్యూ అమీన్ నగర్ లో సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అమీన్ నగర్ అభివృద్ధి వేదిక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం 6వ వార్డు రాజీవ్ గాంధీ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా 113మంది పేదలతో దరఖాస్తులు అందజేశారు. కార్యక్రమంలో అభివృద్ధి వేదిక కన్వీనర్ బత్తల సాంబశివ తదితరులు పాల్గొన్నారు.