కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు బుధవారం సింహవహనోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సింహవాహనంపై తిరువీధుల్లో యోగ నరసింహుడై ఖాద్రీసుడు ఊరేగారు. భక్తకోటికి కనువిందు చేస్తూ దర్శనభాగ్యం కలిగించారు. భక్తులు పూజల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాను తిలకించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.