వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆలయ అధికారులు చేస్తున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అధికారులతో సమావేశమై వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయం ఈవో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.