కదిరి: ప్రజాదర్బార్ లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

72చూసినవారు
కదిరి: ప్రజాదర్బార్ లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద శనివారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అధికారులతో కలసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆర్డివో, తహసీల్దార్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్