కదిరి పట్టణంలోని 32వ వార్డులో పెన్షన్ లను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పార్టీ నాయకులు, అధికారులు, సచివాలయం సిబ్బందితో కలసి లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే ఒక్క రోజు ముందుగానే పెన్షన్ లు పంపిణీ చేసారు.