కదిరి పట్టణంలోని ఆర్టీవో ఆఫీస్ నందు వాహన దారులు హెల్మెట్ ల వాడకం పై గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కదిరి ఎమ్యెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీవో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.