12 సంవత్సరాల అబ్బాయి తప్పిపోయారని సోమవారం కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. మదార్ సాబ్ వీధిలో ఉన్న బాబ్ జాన్ కుమారుడు నవాజ్ అలీ వయసు 12 సంవత్సరాలు ఉర్దూ పాఠశాల 7వ తరగతి చదువుతున్నాడని సీఐ తెలిపారు. ఆ అబ్బాయి సమాచారం తెలిస్తే సీఐ సెల్ నెంబరు 94407 96851కు లేదా తండ్రి నెంబరుకు 63044 52518కు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.