కదిరి పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయని గురువారం వారు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగుట్ట వీధి , సింహకోట ప్రాంతం, కల్లంగడి వీధి, రైల్వే స్టేషన్ రోడ్డు, మారుతి నగర్, గాంధీ నగర్, కంచుకోట వంటి ప్రాంతాలలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని వివరిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.