పిల్లలపై, మహిళలపై నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని పుట్టపర్తి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో పోలీస్ సేవలను పొందాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ బాబ్జాన్తోపాటు కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.