కదిరి నియోజకవర్గం టీడీపీ విస్త్రత స్థాయి సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పివిఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కదిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. త్వరలో మండలాల పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలిపారు.