కదిరి: వైసీపీ నేత జగన్మోహన్ అరెస్టు

52చూసినవారు
కదిరి: వైసీపీ నేత జగన్మోహన్ అరెస్టు
కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. గాండ్లపెంట శిలాఫలకాల ధ్వంసం కేసులో వైసీపీ నేత జగన్మోహన్‌ ను పోలీసులు అరెస్టు చేసి కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే వారిని విచారిస్తుండగా మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా మరికొందరు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హల్ చల్ చేయాలని చూశారు. నిందితులను సమర్ధిస్తారా అని పోలీసులు ప్రశ్నించడంతో వైసీపీ నేతలు తోక ముడిచి అక్కడి నుంచి వెళ్ళిపోమారు.

సంబంధిత పోస్ట్