మదరసాలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందికుంట

58చూసినవారు
మదరసాలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందికుంట
నల్లచెరువు మండలంలోని మదరసా-ఏ-రియజుల్-ఉలుమ్ నందు గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరై మదరసాలో జాతీయ జెండాను అవిష్కరించి జెండా వందనం స్వీకరించారు. స్వాతంత్ర పోరాటంలో అమరులైన యోధుల గురించి విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్