నంబులపూలకుంట: విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

65చూసినవారు
నంబులపూలకుంట: విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ
కదిరి నియోజకవర్గం నంబులపూల కుంట మండలం జడ్పీ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఎస్ సీ స్టడీ మెటీరియల్ ను కదిరి ఎమ్యెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందజేశారు. శుక్రవారం స్థానిక జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతులు మీదుగా స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్