ఎన్ పి కుంట మండలం, గౌకనపల్లి గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో షేక్ నూర్ మహమ్మద్, షేక్ నస్రీన్ బాను దంపతులకు పుట్టిన షేక్ అహమ్మద్ హుస్సేన్ కోడిహినహళ్లి ఏ పి ఆర్ ఎస్ స్కూల్ నందు 10వ తరగతి లో 595 మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడలో ప్రతిభా పురస్కారం అందించి సత్కరించారు.