ఒరవాయి: విద్యుత్ తీగలతో పొంచి ఉన్న ప్రమాదం

64చూసినవారు
ఒరవాయి: విద్యుత్ తీగలతో పొంచి ఉన్న ప్రమాదం
మండల కేంద్రంలో పలు చోట్ల విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉంది. మండల కేంద్రంలోని ఒరవాయి రోడ్డులో గల మిద్దెలపై విద్యుత్ తీగలు చేతికందే ఏత్తులో ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని నివాస ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ కారణంగా ఉక్కపోతకు తట్టుకోలేక మిద్దెలపై నిద్రించాలంటే చేతికి అందె ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలతో భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంటుందని మండలంలోని పలువురు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్