కదిరి పట్టణంలో తరుచూ అక్రమ గంజాయి రవాణా, మట్కా, లాటరీ వంటి చట్ట వ్యతిరేఖమైన పనులు చేసేవారి వారి ఇళ్ళల్లో ఎస్ఐ, పోలీస్ సిబ్బందితో కలసి ఆకస్మిక సోదాలు చేపట్టినట్లు శుక్రవారం సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. టౌన్ పోలీసు స్టేషన్ వద్ద చట్ట వ్యతిరేఖమైన పనులు చేసే వారితో పాటు ఇరాని స్ట్రీట్ లో నివాసముంటున్న గంజాయి రవాణా చేస్తున్నారన్న అనుమానంతో 11 మంది ఇరాని గ్యాంగ్ కి డిఎస్పీ శివనారాయణ స్వామి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.