పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదన్నారు.