ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్.ఐ

52చూసినవారు
ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్.ఐ
నల్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ దత్త సాయి సేవా సమితి అధ్యక్షతన, కిమ్స్ సవేరా ఆస్పత్రి వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఎస్సై కేయం లింగన్న గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా మండల కేంద్రంలో శ్రీ దత్త సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించడం మండల ప్రజలకు గొప్ప అవకాశమన్నారు.

సంబంధిత పోస్ట్