కదిరిలో వినాయక ఏర్పాట్లు రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎస్పీ

84చూసినవారు
కదిరిలో వినాయక ఏర్పాట్లు రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎస్పీ
వినాయక చవితి వేడుకలను అందరూ ఐకమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న సూచించారు. గురువారం కదిరి డిఎస్పి శ్రీలతతో కలిసి ఎస్పి కదిరిలో వినాయకుని ఏర్పాట్లు, నిమజ్జనం సమయంలో ఊరేగింపుగా వెళ్లే కాలనీలు, నిమజ్జన చేసే ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. మసీదుల వద్ద ముస్లిం మత పెద్దలతో పాటు హిందువులతో కూడా మాట్లాడి వినాయక చవితి పండగను అందరూ ఐకమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్