కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా సకాలంలో ఆర్టీసీ బస్సులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ఓయూఐ జిల్లా సహాయ కార్యదర్శి గాలివీడు ఉపేంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం వల్ల పాఠశాలలకు, కళాశాలలకు ఆలస్యంగా వస్తున్నారని సకాలంలో బస్సులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కదిరి ఆర్టీసీ డిపో మేనేజర్ మైనుద్దీన్ ను గురువారం కోరారు.