తనకల్లు: వీర జవాన్ మురళి నాయక్ కి ఘన నివాళి

68చూసినవారు
తనకల్లు: వీర జవాన్ మురళి నాయక్ కి ఘన నివాళి
కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ ఆదేశాల మేరకు తనకల్లు మండలం వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ అశోక్ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి శనివారం పూల మాలవేసి ఘన నివాళి అర్పించారు. వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ అశోక్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించడం చాలా గొప్ప విషయం అని పేర్కొన్నారు. జవాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్