ఇనుప కడ్డీలు ఎత్తుకెళ్లిన ముద్దాయి అరెస్ట్

54చూసినవారు
ఇనుప కడ్డీలు ఎత్తుకెళ్లిన ముద్దాయి అరెస్ట్
తలుపుల మండలం కుర్లి గ్రామానికి చెందిన వెంకటశివారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. జనవరి నెలలో హంద్రీనీవా కెనాల్ వద్ద పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించి ఇనుప కడ్డీలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. సిబ్బంది శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదుచేసినట్లు తెలిపారు. మంగళవారం గ్రామ శివారులో ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్