చిన్నారిని వదిలి వెళ్లిన తల్లి ఆచూకీ లభ్యం

60చూసినవారు
చిన్నారిని వదిలి వెళ్లిన తల్లి ఆచూకీ లభ్యం
కదిరి పట్టణంలో ఆదివారం ఐదునెలల చిన్నారిని బస్టాండులో వదిలివెళ్లిన మహిళ ఆచూకీని పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలానికి చెందిన జ్యోతీ, భర్త మృతిచెందిన తర్వాత బెంగళూరుకు వెళ్లి రెండో పెళ్లి చేసుకుంది. అక్కడ భర్త వేధింపులు భరించలేక కదిరికి చేరుకుంది. బస్టాండులోని యువతికి చిన్నారిని అప్పగించి చనిపోవాలని నిర్ణయించింది. పోలీసులు ఆమెను స్టేషన్కు తీసుకొని విచారించి, సమీప బంధువులకు అప్పగించనున్నారు.

సంబంధిత పోస్ట్