శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం నెలకొంది. పుంగనూరు సుగాలిమిట్టలో లారీ ఢీకొని టీచర్ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. కలకడ మండలం, ఎర్రయ్యగారిపల్లికి చెందిన వై.వెంకటరమణ (45), అతని భార్య శారద (40) లు ములకలచెరువులోని ఓ ప్రభుత్వ స్కూల్లో ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఆదివారం కుమార్తె కీర్తి (17)తో కలసి కారులో పుంగనూరు వైపు వెళు తుండగా, సుగాలిమిట్టలో లారీ ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మదనపల్లెకు తరలించగా శారద మృతి చెందింది. వెంకటరమణచ అతని కుమార్తె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు.