కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. యస్. మక్బూల్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం వద్ద ఘనంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను బి. యస్. మక్బూల్ ఆవిష్కరించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి కేట్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.