ఇదిమంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కదిరి మున్సిపాలిటీ పరిధిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ఇంటింటికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వెళ్లి వంద రోజులలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పాంప్లెట్లను పంపిణీ చేసి తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల శ్రేయస్సు కోరే మంచి ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు.