అనంతపురం జిల్లా కల్యాణదుర్గం కన్నెపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.కన్నెపల్లి రోడ్డులో రెండు ఆవులను చిరుత చంపడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. స్థానికులు రాత్రిపూట ఒంటరిగా తిరగొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాశ్వత పరిష్కారం కోరుతూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.