కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డిటి సేవలను నిలిపివేసిన విషయం పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. కంబదూరు మండలం అండేపల్లి గ్రామంలో గురువారం కళ్యాణదుర్గం ఇన్ఛార్జి తలారి రంగయ్య పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆగదన్నారు. ఆర్డిటి సేవలు కొనసాగే వరకు పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.