శెట్టూరు మండలంలోని మంగంపల్లి వద్ద ఆదివారం టమాటా బాక్సులతో అనంతపురం వెళ్తున్న బొలెరో వాహనం గోతిలోకి పడి బోల్తా పడింది. శెట్టూరు గ్రామానికి చెందిన రైతు ఈ వాహనంలో టమాటా పెట్టెలు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో వాహనాన్ని తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం గమనార్హం.