బ్రహ్మసముద్రం మండలం గుండగానిపల్లిలో మానసిక ఒత్తిడితో టీడీపీ కార్యకర్త ఈశ్వర్ ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన తెలిసిన వెంటనే టీడీపీ మండల నేతలు గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, టీడీపీ ఎప్పుడూ వారి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.