ప్రజల భక్తిని, అవసరాలను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారస్తులు

74చూసినవారు
ప్రజల భక్తిని, అవసరాలను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారస్తులు
వరలక్ష్మీ వ్రతం కారణంగా పూల ధరలు పెరిగాయని కళ్యాణదుర్గం పట్టణవాసులు శుక్రవారం విలేఖరులతో తెలిపారు. గత నెలలో మల్లెల ధర కేజీ రూ. 550లు ఉండగా ఇప్పుడు రూ. 1,500లు, తెల్ల చామంతి రూ. 200లు నుంచి రూ. 350లు, పసుపు చామంతి రూ. 150లు నుంచి రూ. 400లు, కనకాంబరంరూ. 100లు నుంచి రూ. 300లు, లిల్లీ రూ. 150లు నుంచి రూ. 500లు, జాజులు రూ. 300లు నుంచి రూ. 1,200లకు చేరాయన్నారు. దీంతో కొనలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్