టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ - అదుపు చేసిన పోలీసులు

2593చూసినవారు
కంబదూరు మండలం పాళ్లూరు గ్రామంలో ఆదివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహిస్తుండగా ఒకవైపు వైసీపీ కార్యకర్తలు, టిడిపి కార్యకర్తల మధ్య మాటల యుద్ధంతో పాటు చిన్నపాటి ఘర్షణ నెలకొంది. దీంతో కొద్దిసేపు పాళ్ళూరు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల వెంటనే అక్కడికి చేరుకొని ఘర్షణ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్