కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందర సిపిఎం, ఎస్సీ, ఎస్టీ జేఏసి తాలూకా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే నోరు మెదపని డిప్యూటీ సీఎం వైఖరిని పూర్తిగా తప్పు పడుతున్నామని సిపిఐ తాలూకా అధ్యక్షుడు గోపాల్ మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామ దళితులను కుల దురంకారంతో గ్రామ బహిష్కరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ, జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.