కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని గూబనపల్లిలో శనివారం విద్యుత్ స్తంభం మరమ్మతు సమయంలో విద్యుత్ షాక్ కు గురైన ప్రైవేట్ లైన్మెన్ వన్నూరుస్వామి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఐ యువరాజు, ఏఈ సలీంతో చర్చలు జరిపి బాధితుని చికిత్స, కుటుంబానికి న్యాయంకోసం చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.