కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, దివ్యాంగుడు కంబాల తిమ్మారెడ్డికి జిల్లాస్థాయి సేవా అవార్డు దక్కింది. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు కేంద్రంలో అవార్డుల ప్రధానం చేశారు. అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కేశవనాయుడు, రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణప్రసాద్ చేతుల మీదుగా కంబాల తిమ్మారెడ్డి అవార్డును అందుకొన్నారు.