కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, సతీమణి రమాదేవి, కుమారుడు యశ్వంత్, వియ్యంకులు ముత్తినేని రాజగోపాల్, రాధమాధవితో కలిసి విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి శుక్రవారం వెళ్లారు. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్లకు కుమార్తె వివాహ పత్రిక అందజేసి, వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.