దుర్గం: అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిని పట్టుకున్న పోలీసులు

83చూసినవారు
దుర్గం: అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిని పట్టుకున్న పోలీసులు
కంబదూరు మండలంలో అనంతపురం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసులు, ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో బోయ నాగరాజు అనే వ్యక్తి ఓ ఇంటిలో మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 48మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు మా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్